ప్రముఖ పాప్ ఐకాన్ మైఖేల్ జాక్సన్‌పై వచ్చిన పిల్లల లైంగిక వేధింపుల ఆరోపణలు, కోర్టు విచారణ ఆధారంగా రూపొందించిన ‘మైఖేల్ జాక్సన్: ది వర్డిక్ట్’ అనే సరికొత్త డాక్యు-సిరీస్ ట్రైలర్‌ను నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. అప్పట్లో కోర్టు గదిలో ఉన్న కీలక వ్యక్తుల సాక్ష్యాల ఆధారంగా విచారణ లోపలి కథను చూపించబోతున్నారు. విచారణను ప్రత్యక్షంగా చూసిన జ్యూరీ సభ్యులు, ప్రత్యక్ష సాక్షులు, ఆరోపణలు చేసిన బాధితులు మరియు జాక్సన్‌ను సమర్థించిన వారి నిజమైన ఇంటర్వ్యూలను ఇందులో పొందుపరిచారు.