ప్రధాని నరేంద్ర మోదీ తన ఐదు దేశాల పర్యటనలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి అస్సాం రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన.. ‘గోల్డెన్ సిల్క్’గా పిలవబడే ‘ముగా సిల్క్’ శాలువాను, యూఏఈ రాణి షేఖా ఫాతిమా బింట్ ముబారక్ అల్ కేత్బీకి తెలంగాణలోని కరీంనగర్‌కు చెందిన జగత్ ప్రసిద్ధ ‘సిల్వర్ ఫిలిగ్రీ’ పెట్టెను, నార్వే యువరాజుకు ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రసిద్ధి చెందిన ‘కళంకారీ’ శైలిలో రూపొందించిన సూర్యచంద్రుల చిత్రపటాన్ని బహుమతిగా ఇవ్వగా.. నార్వే రాణి సోంజాకు ఒడిశాకు చెందిన సాంప్రదాయ ‘తాళపత్ర చిత్రం’ బహుకరించారు.

