ఓ తెలుగు న్యూస్ ఛానెల్ నిర్వహించిన చర్చలో పవన్, నాదెండ్ల అంశంపై నాగేశ్వర్ క్లారిటీ ఇచ్చారు. పవన్, నాదెండ్లపై తాను చేసిన వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నానని ఆయన చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి బేషజాలు గానీ, ఎలాంటి శషబిషలు లేకుండా తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో తనకు ఓ వ్యక్తి ద్వారా సమాచారం అందిందని, ఆ సమాచారాన్ని పరిశీలించకుండానే తాను వాటిని అలాగే చెప్పానని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలని ఆయన వ్యాఖ్యానించారు.