ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కాకినాడ జిల్లా ఇంద్రపాలెం పీఎస్‌లో కేసు నమోదైంది. ఓ టీవీ ఛానల్ డిబేట్ షోలో పాల్గొన్న నాగేశ్వర్ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌తో చంద్రబాబు టెంపరరీ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అంటూ అమిత్ షా అన్నాడని కామెంట్ చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఇంద్రపాలెం పీఎస్‌లో జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.