తెల్లవారుజామున వడోదర నుండి జరోడ్ వెళ్లే హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ట్రక్కు లగ్జరీ బస్సును బలంగా ఢీకొట్టడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్ లోని బంస్వారం నుండి సూరత్ వెళ్తున్న లగ్జరీ బస్సు, జరోడ్ లోని కోటంబి గ్రామం సమీపంలో హైవేపై ఆగి ఉన్న ట్రక్కు వెనుక భాగాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.