అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రంలోని స్ర్కైడ్రైవింగ్ శిక్షణ విమానంలో కూలిపోవడంతో 12 మంది మృతి చెందారు. మృతులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా కౌతాళం మండలం రాజానగర్‌కు చెందిన సాయి కార్తీక్ వర్మ(24) ఉన్నాడు. 2023లో సాయి ఎంఎస్ చేయడానికి అమెరికాకు వెళ్లాడు. కన్సాస్‌లో నివసిస్తూ తాత్కాలిక ఉద్యోగం చేస్తున్నాడు. స్కైడ్రైవింగ్లో శిక్షణ పొందితే త్వరగా ఉద్యోగాలు వస్తాయని చెప్పడంతో శిక్షణ సంస్థలో చేరాడు. సింగిల్ ఇంజిన్ ప్రైవేటు విమానం స్కై డైవింగ్ చేసేందుకు టేకాఫ్ కాగానే కొద్దిసేపటికి సాంకేతిక లోపంతో కుప్పకూలి మంటలు చెలరేగాయి.