కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం నేపథ్యంలో పలువురు విద్యార్థులపై వేటు పడింది. బీడీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులను ర్యాగింగ్ చేశారని ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ పై కేసు నమోదైంది. ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సంజీవ్ సింగ్ యాదవ్ ఫిర్యాదుతో 12 మంది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ పై తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ కింద సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులను 6 నెలల పాటు ప్రిన్సిపల్ సస్పెండ్ చేశారు.