ఫ్రాన్స్‌లో జరిగిన G7 సదస్సులో భాగంగా నిర్వహించిన ‘ఔట్‌రీచ్ సెషన్’లో ప్రధాని నరేంద్ర మోదీ “నూతన భాగస్వామ్యాల నిర్మాణం, అంతర్జాతీయ సంఘీభావం పునరుద్ధరణ” అనే అంశంపై మాట్లాడిన మోదీ, ప్రపంచ దేశాల మధ్య సహకారం, భాగస్వామ్యాల ప్రాముఖ్యతపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు వనరుల కొరత కంటే పరస్పర నమ్మకం లోపించడమే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.జీ7 సదస్సు సందర్భంగా కెనడా ప్రధాని మార్క్ కార్నీతో పాటు పలువురు అంతర్జాతీయ నాయకులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు.