భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మరోసారి సత్తా చాటింది. జర్మనీలో జరిగిన హైలో ఓపెన్-2026 బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో డెన్మార్క్ క్రీడాకారిణి లైన్ కేజర్స్ఫెల్డ్ పె ఘన విజయం సాధించింది. వరుస గేముల్లో 21-12, 21-14 స్కోరుతో ప్రత్యర్థిని ఓడించింది. ఈ విజయంతో సింధు ఖాతాలో ఈ ఏడాది రెండో టైటిల్ చేరింది. అంతకుముందు జులైలో జరిగిన జపాన్ ఓపెన్ లోనూ ఆమె విజేతగా నిలవడం తెలిసిందే.