కొండపై నుంచి భారీ బండరాళ్లు విరిగి, దొర్లుతూ కదులుతున్న వాహనంపై పడటంతో ఆరు నెలల చిన్నారి సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహౌల్-స్పితి జిల్లాలో ఉదయ్‌పూర్-పాంగి రహదారిపై శుక్రవారం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కులూ నుంచి కిల్లార్‌కు వెళుతున్న ఎస్‌యూవీలో మొత్తం 15 మంది ప్రయాణిస్తున్నారు.పక్కనే ఉన్న కొండపై నుంచి ఒక్కసారిగా భారీ బండరాళ్లు వాహనంపై పడ్డాయి. వాటి ధాటికి వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయింది.