బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను తండ్రి, బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి KCR దంపతులు ఆశ్వీరదించారు. పుట్టినరోజు సందర్భంగా ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో జీవించాలని దీవించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి కేటీఆర్ మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురు రియాన్షి ఇంకా కుటుంబసభ్యులు, ముఖ్యులు పాల్గొన్నారు.