డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రామచంద్రపురం మండలం వెంకటయ్యపాలెంలో పంట కాల్వలో మునిగి ముగ్గురు మృతిచెందారు. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. తొలుత పావని (14) నీటిలో దిగి గల్లంతవగా.. ఆమెను కాపాడేందుకు రంజిత్ (15), వీరేంద్ర (19) కూడా కాల్వలోకి దిగారు. ఈ క్రమంలో వారు కూడా గల్లంతయ్యారు. స్థానికులు గాలింపు చేపట్టి ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. మృతులు పసలపూడి, పడమర కండ్రిగ గ్రామాలకు చెందినవారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.