ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం వద్ద కుంకీ ఏనుగులకు ఘన స్వాగతం పలికారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పంటపొలాలను నాశనం చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న అడవి ఏనుగుల గుంపును కట్టడి చేసేందుకు ఈ కుంకీ ఏనుగులను రంగంలోకి దించుతున్నారు. అందులో భాగంగా పలమనేరు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు తరలిస్తున్న జయంత్, అభిమన్యు అనే రెండు కుంకీ ఏనుగులు అమరావతిలోని డిప్యూటీ సీఎం కార్యాలయానికి చేరుకున్నాయి.