జనసేనలో మరో గ్రూపు లేదని… ఎవరైనా పవన్ కల్యాణ్ గ్రూపే అని చెప్పుకొచ్చారు. ఎక్కడ జనసేన సీట్లు తీసుకోవాలి, ఎక్కడ పోటీ చేయాలనేది అధినేత పవన్ కల్యాణ్ అంతిమంగా నిర్ణయిస్తారన్నారు. జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ విజయవాడలో పార్టీ కేడర్ సమావేశంలో పాల్గొన్నారు. సాధారణ ఎన్నికలలో రాష్ట్ర హితం కోసం కూటమి ధర్మానికి కట్టుబడి అందరూ కలిసి పని చేశారని చెప్పారు. పవన్ కల్యాణ్ పదవులు కోసం జనసేన ఏర్పాటు చేయలేదని.. యువతను, మహిళలను చైతన్యపరిచేలా జనసేన పార్టీ తొలి అడుగులు వేసిందని చెప్పారు.