సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఆశ్రిత (19) అనే విద్యార్థిని నిన్నటి నుండి కనిపించకుండా పోయింది. నిన్న ఆశ్రిత తల్లిదండ్రులు ఆమెకు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. అనుమానంతో క్యాంపస్ హాస్టల్ కు వచ్చిన తల్లిదండ్రులు అక్కడ సిబ్బందిని విచారించారు. విద్యార్థిని ఔటింగ్ కు వెళ్లి తిరిగి రాలేదని హాస్టల్ సిబ్బంది వారికి వెల్లడించారు. కూతురు ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే పటాన్ చెరు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.