లోకసభ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ ‘ఇస్తీఫా’ నినాదాలతో హోరెత్తించారు. నీట్ పరీక్షల వివాదంపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టాయి. విపక్షాల నినాదాలు, ఆందోళనలు కొనసాగడంతో స్పీకర్ లోక్ సభను సోమవారం ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలోనూ ఇదే విధమైన ఉత్కంఠ వాతావరణం నెలకొనడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.