గురువారం రాత్రి విడుదల చేసిన దాదాపు 3 నిమిషాల వీడియో సందేశంలో ప్రధాని మోదీ పలు కీలక విషయాలను వెల్లడించారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటమే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యం అని చెప్పారు శుక్రవారం జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై సుదీర్ఘంగా చర్చించి ఆమోదిస్తామని తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల రెండో వారంలోనే ఈ కొత్త బిల్లును సభ ముందుకు తెచ్చి చట్టంగా మారుస్తామని హామీ ఇచ్చారు.