ఆగస్టు 1న రాష్ట్రానికి రానున్న ప్రధాని మోదీ విమానం భోగాపురంలోనే ల్యాండ్ అవుతుందని విశాఖ జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్టును ప్రధాని మోదీ ప్రారంభించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారని చెప్పారు. అదే రోజు ఏఎస్ఐపీ సెమీకండక్టర్ పరిశ్రమను ప్రధాని ప్రారంభిస్తారని కలెక్టర్ తెలిపారు.భోగాపురం వెళ్లడానికి ప్రయాణ సమయం తగ్గేలా పలు చోట్ల స్పీడ్ బ్రేకర్లు తొలగించామన్నారు.