నీట్ 2026 పరీక్షకు సంబంధించిన వివాదంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ప్రముఖుల మద్దతు క్రమంగా పెరుగుతోంది. బాలీవుడ్ నటీనటుల తర్వాత తాజాగా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విద్యార్థులకు సంఘీభావం ప్రకటిస్తూ, విద్యా వ్యవస్థలో అర్థవంతమైన సంస్కరణలు చేపట్టాలని పిలుపునిచ్చారు. విద్యార్థులే దేశ భవిష్యత్తని పేర్కొన్నారు. నీట్ వంటి అత్యంత పోటీ పరీక్షల కోసం సంవత్సరాల పాటు కష్టపడి సిద్ధమయ్యే విద్యార్థులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనిశ్చితి బాధాకరమని ఆమె వ్యాఖ్యానించారు.