పోటీ పరీక్షల పేపర్ లీకేజీలను అరికట్టడంతో పాటు విద్యావ్యవస్థలో సమూల సంస్కరణలు తేలాలని డిమాండ్ చేస్తూ గత 26 రోజులుగా సాగుతున్న ఆమరణ నిరాహార దీక్ష ఎట్టకేలకు ముగిసింది. ప్రముఖ పర్యావరణ, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీలు లభించడంతో తన పోరాటాన్ని విరమించారు. గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్‌ల సమక్షంలో వారి చేతుల మీదుగా నిమ్మరసం తాగి ఆయన దీక్ష ముగించారు. ఈ కార్యక్రమంలో ఆయన సతిమణి గీతాంజలి ఆంగ్మో కూడా పాల్గొన్నారు.