కేంద్ర ప్రభుత్వానికి, కాక్రోచ్ జనతా పార్టీ నేతలకు మధ్య శుక్రవారం ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సుదీర్ఘ చర్చలు జరిగాయి. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీలో సీజేపీ ప్రతినిధులు 3 డిమాండ్లను ఉంచారు. తమ ప్రధాన డిమాండ్ అయిన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు.. నీట్ పేపర్ లీక్ సమయంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని, ఆందోళనకారులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని వారు కోరారు.