బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హరీశ్ రావు సిద్ధిపేట పట్టణంలో 100 ఎకరాల నిషేధిత భూములను తన తండ్రి పేరు మీదకు అక్రమంగా బదిలీ చేయించుకున్నారని ఆరోపించారు. తన వద్ద అన్ని ఆధారాలున్నాయని, దమ్ముంటే విచారణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. గుంపు మేస్త్రీ, గుంట నక్క.. ఇద్దరూ ఒక్కటేనని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో అక్రమాలు జరిగాయని.. దమ్ముంటే చర్చ పెట్టాలని సూచించారు.