దేశం ఆయుష్మాన్ భారత్‌గా మారుతోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీలో ఆరోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేస్తామని ఆయన ప్రకటించారు. శనివారం విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో రాష్ట్రవ్యాప్తంగా10 క్రిటికల్ కేర్ బ్లాకులు,12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబరేటరీలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా వర్చువల్‌గా ప్రారంభించారు. 22 ప్రాజెక్టులకు రూ.249 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే ఇది సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు.