స్పెయిన్ టోలెడో ప్రావిన్సులో రెండు హైస్పీడ్ రైళ్లు ఢీకొన్న ఘటనలో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 179 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. మాద్రిద్ నుంచి సెవిల్లే వైపు ఒకే దిశలో రెండు రైళ్లు వెళ్తున్న సమయంలో ఆగి ఉన్న రైలును వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.