సైబర్ నేరాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేసే మోసాలను తీవ్రమైన నేరాలుగా పరిగణించాలని స్పష్టం చేసింది. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించినట్లు కథనంలో పేర్కొన్నారు. పోలీసులు, సీబీఐ అధికారులమంటూ కొందరు సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ ద్వారా కేసులు ఉన్నాయని, అరెస్ట్ చేస్తామని భయపెట్టి డబ్బులు బదిలీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారు.