కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టాటా గ్రూప్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టాటా సంస్థను కొందరు నేరపూరితంగా నిర్వీర్యం చేస్తున్నారని, అయినప్పటికీ దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు భయాందోళనల కారణంగా నోరు మెదపడం లేదని ఆయన ఆరోపించారు. భారతీయ వ్యాపార రంగాన్ని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు తమ ఆటవస్తువులా మార్చుకున్నారని రాహుల్ తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుతం టాటా గ్రూప్‌లో నడుస్తున్న అంతర్గత విభేదాల నేపథ్యంలో రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు కార్పొరేట్ మరియు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.