కేరళంలో జడ్జి కుమారుడి హిట్ అండ్ రన్ కేసులో పోలీసుల దర్యాప్తులో అవకతవకలు చోటుచేసుకున్నట్లు విమర్శలు వస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కొచ్చి నగర పోలీస్ కమిషనర్ కళిరాజ్ మహేశ్ కుమార్ను బదిలీ చేసింది. ఈ కేసు దర్యాప్తులో పలు లోపాలు ఉన్నట్లు గుర్తించామని..హోం మంత్రి రమేశ్ చెన్నితాల పేర్కొన్నారు. కేసులో నిందితుడు జడ్జి కుమారుడు కావడంతో అతడిని కాపాడడానికి కొన్ని గంటల్లోనే రెండు సార్లు బెయిల్ మంజూరు చేశారని, పోలీసులు కుట్ర పన్నారని మృతుడి కుటుంబం ఆరోపించింది.