స్నేహితుల దినోత్సవం రోజున విశాఖలోని పాత గంగవరం బీచ్లో విషాదం చోటుచేసుకుంది. ఫొటోషూట్ కోసం బీచ్ కు వెళ్లిన స్నేహితుల్లో ఇద్దరు గల్లంతయ్యారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా పెందుర్తికి చెందిన ఆటో డ్రైవర్ దామోదర్, జాలరిపేటకు చెందిన నీతూతో పాటు మరో ఐదుగురు ఆదివారం పాత గంగవరం బీచ్ కు వెళ్లారు. అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో నీతూ, దామోదర్ సముద్రంలో గల్లంతయ్యారు. గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టారు. ఘటనపై న్యూ పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.