ఘనంగా ప్రారంభమైన ఉజ్జయిని మహంకాళి బోనాలు..
సికింద్రాబాద్ జనరల్ బజార్‌లోని చారిత్రాత్మక శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ మాస జాతర అత్యంత వైభవంగా మొదలైంది. ఆదివారం వేకువజాము నుంచే తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ హాజరై అమ్మవారికి తొలి బోనంతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించారు.

