కేంద్రం నుంచి రాష్ట్రాలను రావాల్సిన పన్నుల వాటాను కేంద్రం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,597 కోట్లు, తెలంగాణకు రూ.2,370 కోట్లు కేటాయించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రూ.13,088 కోట్లు విడుదల చేసింది. అదే విధంగా బీహార్ కు రూ.7,338 కోట్లు, పశ్చిమ బెంగాల్ కు రూ.5,488 కోట్లు, మధ్యప్రదేశ్ కు రూ.5,727 కోట్లు, మహారాష్ట్రకు రూ.4,609 కోట్లు, రాజస్థాన్ కు రూ.4,396 కోట్లు విడుదల చేసింది. సాధారణంగా ప్రతి నెలా పదో తేదీలోపు జరిగే ఈ ప్రక్రియను ఈ సారి కేంద్రం ముందస్తుగానే పూర్తి చేసింది.