పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ‘జైషే మహమ్మద్’ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న హమీమ్ మొండల్ అనే వ్యక్తిని పూర్బా బర్ధమాన్ జిల్లాలో ఎస్టీఎఫ్ అరెస్ట్ చేసింది. అతను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని లక్ష్యంగా చేసుకోవడంతో పాటు, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో అశాంతి సృష్టించేందుకు ప్లాన్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
విచారణలో భాగంగా హమీమ్ ప్రియురాలు అర్పితా సర్కార్‌ను కూడా జార్ఖండ్‌లో శుక్రవారం అరెస్ట్ చేశారు. ఆమె వాట్సాప్ చాట్లలో పాకిస్థాన్‌తో సంబంధాలు బయటపడ్డాయని పోలీసులు తెలిపారు.