ఆహారంలో పురుగులు వస్తున్నాయని.. ఇక్కడ ఉండలేమంటూ ముగ్గురు విద్యార్థినులు హాస్టల్ నుంచి పారిపోయారు. హనుమకొండ జిల్లా శాయంపేట కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీవీబీ) నుంచి అర్ధరాత్రి గోడదూకి బయటకు వెళ్లిపోయారు. శనివారం అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో ముగ్గురు విద్యార్థినులు హాస్టల్ ప్రహరీ గోడ దాటి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది, పోలీసులు, తల్లిదండ్రులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం ఉదయం గోవిందాపూర్ వెళ్లే మార్గంలోని చెట్ల పొదల్లో దాక్కున్న విద్యార్థినులను తల్లిదండ్రులు గుర్తించి సురక్షితంగా తీసుకొచ్చారు.