లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన చివరిదైన మూడో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో కదంతొక్కాడు. 388 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియాకు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి అద్భుతమైన ఆరంభాన్ని అందించిన హిట్‌మ్యాన్ చాలా కాలం తర్వాత తనదైన మార్క్ షాట్లతో అలరించాడు. 85 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులతో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ అంటూ పుకార్లకు పుల్ స్టాప్ పడినట్లు అయింది.