ఇరాన్ ఆదివారం జోర్డాన్ వైపు క్షిపణులను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఈ పరిణామాలతో యుద్ధ ప్రభావం పొరుగు దేశాలకు మరింత విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పలు వారాల విరామం తర్వాత మళ్లీ వైమానిక దాడుల హెచ్చరిక సైరన్లు మోగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్ సైన్యం సూచించింది. జోర్డాన్‌లోని కీలక నౌకాశ్రయ నగరం అకాబాను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులను ప్రయోగించినట్లు పేర్కొంది.