ఆఫ్రికా దేశమైన సూడాన్‌లో అంతర్యుద్ధం రోజురోజుకూ మరింత భీభత్సంగా మారుతోంది. బుధవారం రాత్రి సూడాన్‌లోని ఎల్ ఒబెయిద్ నగరంలో జరిగిన భీకర డ్రోన్ దాడులు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. ఈ ఘోర దాడిలో కనీసం 15 మంది పౌరులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, డజన్ల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు.మరణించిన వారి అంత్యక్రియలు నిర్వహించే శ్మశాన వాటిక వద్ద ఉన్న ప్రజలపై కూడా దాడులు జరగడం అక్కడి భయానక పరిస్థితికి అద్దం పడుతోంది.