ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి పోటాపోటీ ర్యాలీలకు సన్నద్ధం కావడంతో ఉద్రిక్తత నెలకొంది. “వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో పాల్గొనడానికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దరెడ్డి ఇంటినుంచి బయల్దేరారు. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు తలెత్తనున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాడిపత్రిలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అయితే వైసీపీ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని పెద్దిరెడ్డికి పోలీసులు సూచించారు.