ఇరాన్‌పై దాడుల విరమణ, శాంతి ఒప్పందంపై ట్రంప్ కీలక ప్రకటన అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించి యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. చర్చలు కొలిక్కి వచ్చాయని, ఒప్పంద అంశాలకు ఇరాన్ అగ్రనాయకత్వంతో పాటు ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ వంటి దేశాలు ఆమోదం తెలిపాయని పేర్కొన్నారు. ఈ వారంలోనే ఒప్పందం జరగవచ్చని, సంతకాల వేదిక, సమయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.