రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబ సమేతంగా పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి సన్నిధికి విచ్చేశారు. శుక్రవారం ఉదయం ఆయన తన కుమారుడు అనంత్ అంబానీ, కోడలు రాధిక మర్చంట్‌తో కలిసి శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ముఖేష్ అంబానీ శ్రీవారి
అభిషేక సేవలో పాలుపంచుకున్నారు. అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య అత్యంత వైభవంగా జరిగిన ఈ కన్నుల పండువ లాంటి సేవలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.