సుమలత బహిరంగ క్షమాపణలు చెప్పాలని శేఖర్ మాస్టర్ అన్నారు. జానీ మాస్టర్ సతీమణి సుమలత పై ఫెడరేషన్ కు అలాగే డాన్సర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు రఘు మాస్టర్ కి కంప్లైంట్ చేశారు శేఖర్ మాస్టర్. అలాగే సుమలత, సీనియర్ డాన్సర్ లక్షి తన పై అనుచిత వ్యాఖ్యలు చేశారని శేఖర్ మాస్టర్ పిర్యాదు చేశారు. నా మనోభావాలు దెబ్బతినేలా సుమలత నా గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడారు, నా పుట్టు పూర్వోత్తరాలు గురించి కూడా మాట్లాడారని శేఖర్ మాస్టర్ అన్నారు.