హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దానం నాగేందర్ ఇవాళ మధ్యాహ్నం సుప్రీంకోర్టులో SLP దాఖలు చేశారు. ఈ పిటిషన్ సుప్రీంకోర్టు అనుమతిస్తుందా? లేదా? అనేది వేచిచూడాల్సి ఉంది. ఒకవేళ దానం నాగేందర్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించి అప్పీలు దాఖలుకు అనుమతిస్తే.. హైకోర్టు తీర్పుపై దానం నాగేందర్ అప్పీలు చేసే అవకాశం ఉంటుంది. ఇదే కేసులో ఇప్పటికే భాజపా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిర్రెడ్డి కేవియట్ దాఖలు చేశారు.