ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నం పర్యటన సందర్బంగా ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సుమారు రూ. 8,874 కోట్ల విలువైన భూములపై 28,445 పేద కుటుంబాలకు హక్కులు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల స్థలాల సమస్యకు పరిష్కారం చూపుతూ భాగంగా 11 మండలాల పరిధిలోని 399 ఎకరాల (19,33,853 చదరపు గజాల) ఆక్రమిత, నివాస భూములను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది.