నాగర్ కర్నూల్ జిల్లాలో గుమ్మడం గ్రామంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సందర్శించిన కేటీఆర్ సబ్‌స్టేషన్‌లోని లాగ్‌బుక్స్‌ను పరిశీలించారు. విద్యుత్ కోతల గురించి స్థానిక రైతులను అడిగి తెలుసుకున్నారు. రోజుకు 5 గంటలే కరెంట్ వస్తుంది సార్.. మాకు కెనాల్ కూడా బంద్ అయింది.. సబ్ స్టేషన్ సిబ్బంది 12 గంటలు కరెంట్ ఇస్తున్నమంటే.. ఇస్తున్నవా.. బయటకు రైతులను అడుగుదామా..? ఒకసారి అని కేటీఆర్ ప్రశ్నించారు. కరెంట్ గురించి అడిగితే పైననే పోయింది.. మాకేం తెల్వదని అధికారులు చెబుతున్నారు.