కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అస్వస్థతకు గురయ్యారు. షెడ్యూల్ ప్రకారం శనివారం ఆయన కర్ణాటకలోని హుబ్బళ్లిలో రూ.700 కోట్లతో నిర్మించిన కెఎల్‌ఇ జగద్గురు గంగాధర్ మహాస్వామిగళు మూరుసామిరమఠ్ మెడికల్ కళాశాల నూతన భవనంతో పాటు, 1,200 పడకల కెఎల్‌ఇ హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించాల్సి ఉంది. ఈ క్రమంలో, శుక్రవారం రాత్రే ఆయన హుబ్బళ్లిలోని హోటల్‌కు చేరుకున్నారు. అక్కడ అస్వస్థతకు గురి కావడంతో వైద్యుల సలహా మేరకు కార్యక్రమానికి హాజరుకాకుండా హోటల్లోనే ఉండిపోయారు.