ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ (డీయూఎస్‌యూ) ఎన్నికల్లో ఏబీవీపీ ఆధిపత్యం ప్రదర్శించింది. కీలకమైన ప్రెసిడెంట్ స్థానాన్ని గెలుచుకుంది. వైస్ ప్రెసిడెంట్ పదవిని ఇండిపెండెంట్ గెలుచుకున్నాడు. ఈ ఫలితాల్లో ఏబీవీపీనే ఆధిపత్యం కొనసాగించింది. కీలకమైన ఈ 4 స్తానాల్లో ఏబీవీపీ మూడింటిని గెలుచుకుంది. ఒక స్థానాన్ని ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుచుకున్నారు. ఎన్ఎస్యూఐ మాత్రం ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. ఏబీవీపీ తరఫున యష్ దబాస్ (24,576 ఓట్లు) అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ప్రత్యర్థిగా పోటీ చేసిన ఎన్ఎస్యూఐ అభ్యర్థి 22,523 ఓట్లు సాధించాడు.