తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. ఓటుకు నోటు కేసు విచారణలో భాగంగా కోర్టు కస్టడీలో ఉన్న ఆయన పాస్‌పోర్టును తాత్కాలికంగా విడుదల చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. విదేశీ పర్యటనకు సంబంధించిన సమగ్ర షెడ్యూల్, అక్కడ బస చేసే హోటల్/చిరునామాలు మరియు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లను కోర్టుకు అందజేయాలి. ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 10 వరకు సీఎం రేవంత్ రెడ్డి యూకే, అమెరికా, జర్మనీ, చైనాల్లో పర్యటించనున్నారు