తాజాగా ప్రముఖ సింగర్ సునీత చేసిన వ్యాఖ్యలు మరోసారి ఇండస్ట్రీలో మహిళల భద్రతపై చర్చకు దారితీశాయి.ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సునీత, సినీ పరిశ్రమ మహిళలకు పూర్తిగా సురక్షితమైన ప్రదేశం కాదని స్పష్టం చేశారు. ఇండస్ట్రీలో కొన్ని సందర్భాల్లో దోపిడీ, అసభ్య ప్రవర్తన వంటి సమస్యలు ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. తనకు కేవలం 18 ఏళ్ల వయసులోనే ఇలాంటి అసౌకర్యకర పరిస్థితి ఎదురైందని సునీత వెల్లడించారు. అయితే ఆ ఘటన గురించి మరిన్ని వివరాలు చెప్పడానికి ఆమె ఆసక్తి చూపలేదు