మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ అపర కుబేరుడు బిల్ గేట్స్ చుట్టూ ఇంటర్నేషనల్ మీడియాలో మరోమారు తీవ్ర వివాదం ముసురుకుంది. వివాదాస్పద దివంగత ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ తనను బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించినట్లు అమెరికా హౌస్ ఓవర్సైట్ కమిటీ విచారణలో బిల్ గేట్స్ అంగీకరించినట్లు లీకులు రావడంతో ఈ సంచలనం వెలుగులోకి వచ్చింది. ముగ్గురు రష్యన్ మహిళలతో తనకు ఉన్న వివాహేతర సంబంధాల ఆధారంగానే ఎప్స్టీన్ తనను బెదిరించాడని గేట్స్ స్వయంగా ఒప్పుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలను ప్రసారం చేస్తోంది.