లఖ్‌నవూకు చెందిన నీలేశ్ కుమార్ (25), పశ్చిమ బెంగాల్‌కు చెందిన అనామిక సామంత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు ఇరువైపులా పెద్దలు అంగీకారం తెలపడంతో, వచ్చే ఏడాది మార్చిలో వివాహం జరిపించాలని నిశ్చయించారు. ఇద్దరూ ప్రమాదం జరిగిన అలీగంజ్ భవనంలోని ఒక యానిమేషన్ స్టూడియోలోనే పనిచేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలోని సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో ప్రేమజంట కూడా ఉండటం అందరినీ కన్నీరు పెట్టిస్తోంది.