సాయిబాబు ఆలయాలకు టీటీడీ నిధుల కేటాయింపుపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం మరోసారి స్పందించారు. సాయిబాబా ఆలయాల విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను కొంతమంది పూర్తిగా వక్రీకరించారని పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేయడం అత్యంత బాధాకరమని తెలిపారు. కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. తాను వ్యక్తిగతంగా సాయిబాబా భక్తుడినని.. ప్రతిరోజూ ఉదయం తమ పూజా మందిరంలో షిర్డీ సాయిబాబాని భక్తిశ్రద్ధలతో పూజించిన తర్వాతే తన దినచర్యను ప్రారంభిస్తానని చెప్పుకొచ్చారు.