గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామిని ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి పానకం సమర్పించారు. దర్శనానంతరం ఉప ముఖ్యమంత్రికి పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు